Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అమ్మ దగ్గర ఏమీ దాచను .. అన్నీ చెప్పేస్తుంటాను: సాయిధరమ్ తేజ్

  • ఎంతో కష్టపడి అమ్మ మమ్మల్ని పెంచింది 
  • అమ్మ దగ్గర నా కెంతో చనువు వుంది 
  • అన్ని విషయాలను అమ్మకి చెబుతాను
తాజాగా ఐ డ్రీమ్స్ తో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. తల్లి పట్ల తనకి గల ప్రేమానురాగాలను గురించి ప్రస్తావించాడు. తన కెరియర్ పట్ల ఆమె తీసుకునే శ్రద్ధ గురించి .. తల్లి దగ్గర తనకి గల స్వేచ్ఛను గురించి చెప్పుకొచ్చాడు. " మా అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చింది. ఎంతో బాధ్యతాయుతంగా మమ్మల్ని పెంచి పెద్ద చేసింది"

"అందువలన నేను అమ్మ దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టను. నేను పాస్ అయిన విషయాన్ని .. ఫెయిల్ అయిన సంగతిని చెప్పేవాడిని. లవ్ లో పడటం .. లవ్ ఫెయిల్ అయిన విషయం కూడా చెప్పేసేవాడిని. పార్టీలో తాగుతాననే విషయం కూడా ముందుగానే అమ్మకి చెప్పేవాడిని. ఎక్కువగా తాగొద్దనీ .. తాగి డ్రైవ్ చేయొద్దని అమ్మ చెప్పేది" అంటూ అమ్మ దగ్గర తనకి గల ఫ్రీడమ్ గురించి చెప్పుకొచ్చాడు.     
saidharam tej

More Telugu News